ప్రేమ లేఖ రాసి హీరోని ఏడిపించింది
TOLLYWOOD
 TOPSTORY

ప్రేమ లేఖ రాసి హీరోని ఏడిపించింది

Murali R | Published:February 17, 2017, 12:00 AM IST

లేటు వయసులో ఘాటు ప్రేమ లేఖ రాసి హీరో చేత కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది సీనియర్ హీరోయిన్ రేఖ . ఇప్పటికి కూడా గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన భామ రేఖ తాజాగా బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ని ప్రశంసలతో ముంచెత్తుతూ ఓ లేఖ రాసింది. ఇంతకీ ఆ లేఖ ఎందుకు రాసిందో తెలుసా ........ ఇటీవల అమీర్ నటించిన దంగల్ చిత్రం రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

విమర్శకుల ప్రశంసలు అందుకున్న దంగల్ ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్ల భారీ వసూళ్ల ని సాధించింది. పైగా అందరినీ ఆకట్టుకుంది దాంతో రేఖ ఆ సినిమా చూసి అమీర్ కు లేఖ రాసింది. ఇటీవల జరిగిన దంగల్ సక్సెస్ మీట్ లో రేఖ రాసిన లేఖ చదివి కన్నీళ్ల పర్యంతం అయ్యాడు అమీర్.
Comments

FOLLOW
 TOLLYWOOD