నటుడు చిన్నా భార్య మృతి
TOLLYWOOD
 TOPSTORY

నటుడు చిన్నా భార్య మృతి

Murali R | Published:September 12, 2017, 12:00 AM IST
నటుడు, దర్శకుడు చిన్నా భార్య శిరీష ( 42) కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది . శిరీష  స్వల్ప అస్వస్థత కి గురవ్వడంతో అపోలో ఆసుపత్రికి తరలించారు అయితే అకస్మాత్తుగా చనిపోవడంతో చిన్నా కుటుంబం తీవ్ర విషాదంలో నెలకొంది . ఎటువంటి అనారోగ్యం లేని భార్య చనిపోవడంతో చిన్నా కన్నీరు మున్నీరు అవుతున్నాడు . శిరీష - చిన్నా దంపతులకు ఇద్దరు సంతానం . 
 
 
నటుడిగా తెలుగులో పలు చిత్రాల్లో నటించిన చిన్నా కు శివ చిత్రం బ్రేక్ నిచ్చింది . శివ తర్వాత అతడు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది . అయితే నటుడిగా రాణిస్తూనే దర్శకుడిగా కూడా మారాడు . ఆ ఇంట్లో అనే సినిమాకు దర్శకత్వం వహించాడు చిన్నా . భార్య మృతి చెంది విషాదం లో ఉన్న చిన్నా ని పలువురు సినీ ప్రముఖులు పరామర్శించి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు . Comments

FOLLOW
 TOLLYWOOD