నటిని బ్లాక్ మెయిల్ చేస్తున్న నటుడు
TOLLYWOOD
 TOPSTORY

నటిని బ్లాక్ మెయిల్ చేస్తున్న నటుడు

Murali R | Published:June 19, 2017, 12:00 AM IST
కన్నడ పోకిరి చిత్రంలో నటించిన 'హుచ్చ వెంకట్ ' అనే నటుడు కన్నడ పరిశ్రమకే చెందిన నటిని ప్రేమించాడు , అయితే సహా నటుడు కావడంతో ఆమె కూడా కాస్త క్లోజ్ గా ఉంది కానీ సదరు వెంకట్ మాత్రం ఆమె నన్ను ప్రేమిస్తోంది , పెళ్ళికి కూడా ఒప్పుకుంది కానీ ఆమె కుటుంబ సభ్యులు మాత్రం మా పెళ్ళికి ఒప్పుకోవడం లేదంటూ కొత్త డ్రామా కు తెరలేపాడు . నిన్న ఆత్మహత్యా యత్నం చేసి వార్తల్లోకి ఎక్కాడు.

తన ప్రేమకు అంగీకారం తెలపలేదని ఫినాయిల్ తాగి తన స్నేహితులకు సమాచారం ఇచ్చాడు దాంతో రంగ ప్రవేశం చేసిన వెంకట్ స్నేహితులు వెంకట్ ని ఆసుపత్రికి తరలించారు . ఇక అక్కడ మొదలయ్యింది అసలు డ్రామా . ఆసుపత్రిలో నానా రచ్చ చేయడంతో మీడియా కు ఎక్కాడు . దీనివల్ల సదరు నటిని బ్లాక్ మెయిల్ చేసి లొంగ దీసుకోవాలని పెద్ద ప్లాన్ వేసాడు హుచ్చ వెంకట్ అనే నటుడు.Comments

FOLLOW
 TOLLYWOOD