ఆ హీరో అంటే అంత పిచ్చి ఈ భామకు
TOLLYWOOD
 TOPSTORY

ఆ హీరో అంటే అంత పిచ్చి ఈ భామకు

Murali R | Published:October 21, 2017, 10:26 AM IST
ఒంటి మీదకు నలభై అయిదు ఏళ్ళు వచ్చాయి , మరికొద్ది రోజుల్లోనే 45 నుండి 46 వ వయసులోకి అడుగుపెట్టబోతోంది అయినప్పటికీ పెళ్లి పెటాకులు లేకుండా ఒంటరిగా బ్రతికేస్తోంది అందాల భామ టబు . బాలీవుడ్ చిత్రాలతో పాటుగా తెలుగులో కూడా నటించిన ఈ భామ ఇంకా పెళ్లి చేసుకోలేదు కానీ నాకు తగ్గ వరుడ్ని చూసి పెట్టమని బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గన్ ని పోరు పెడుతోందట. అజయ్ దేవ్ గన్ - టబు లు చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు దాంతో అతడంటే పిచ్చి టబు కి . అజయ్ తో కలిసి విజయ్ పథ్ , తక్షక్ , దృశ్యం వంటి చిత్రాల్లో నటించింది టబు , తాజాగా గోల్ మాల్ ఎగైన్ చిత్రంలో నటించింది . ఆ సినిమా రిలీజ్ కి సిద్దమైన నేపథ్యంలో అతడి సినిమాలో నటించడానికి నాకెటువంటి అభ్యంతరం లేదని చెబుతూనే నాకు అజయ్ వెరీ వెరీ స్పెషల్ అని అంటోంది . 
 
 
తెలుగులో నాగార్జున సరసన నటించింది టబు . నాగార్జున తో టబు కి ఎఫైర్ ఉందని అప్పట్లో బోలెడు గుసగుసలు వచ్చాయి అంతేకాదు టబు కి నాగార్జున కూడా స్పెషలే ! రొమాన్స్ కి ఏమాత్రం వెనుకాడని టబు పెళ్లి మాత్రం ఇంకా చేసుకోలేదు . వచ్చే నెల నవంబర్ 4టబు పుట్టినరోజు అంటే 45 ఏళ్ళు పూర్తయి 46 వ వసంతం లోకి అడుగుపెడుతుంది అన్నమాట .Comments

FOLLOW
 TOLLYWOOD