బాహుబలి 2 రికార్డ్ ని బద్దలు కొట్టిన వివేగం
TOLLYWOOD
 TOPSTORY

బాహుబలి 2 రికార్డ్ ని బద్దలు కొట్టిన వివేగం

Murali R | Published:September 5, 2017, 12:00 AM IST
తమిళనాట బాహుబలి 2 , కబాలి రికార్డులను బద్దలు కొట్టి 150 కోట్ల క్లబ్ లో చేరింది అజిత్ వివేగం . ఆగస్టు 24న రిలీజ్ అయిన వివేగం చిత్రానికి సినీ విమర్శకుల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి కానీ ఆ విమర్శలతో సంబంధం లేకుండా తమిళనాట మాత్రం మంచి వసూళ్ల ని సాధిస్తోంది వివేగం . శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి దాంతో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి .
 

వరల్డ్ వైడ్ మొదటి వారంలోనే వంద కోట్ల మైలురాయి ని అందుకొని సంచలనం సృష్టించిన వివేగం తమిళనాట కబాలి , బాహుబలి 2 చిత్రాల రికార్డులను బద్దలు కొట్టేసింది . రెండో వారం లో 150 కోట్ల క్లబ్ లో చేరింది . కేంద్ర ప్రభుత్వం విధించిన జి ఎస్ టి తర్వాత తమిళనాట వంద కోట్ల మైలురాయి ని అందుకున్న తొలిసినిమా ఈ వివేగం దాంతో అజిత్ ఫ్యాన్స్ మరింత సంతోషంగా ఉన్నారు . శివ - అజిత్ ల కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన రెండు సినిమాలతో పాటు ఇది కూడా హిట్ అవ్వడంతో హ్యాట్రిక్ పూర్తయ్యింది . ఇక వచ్చే ఏడాది డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టనున్నారట . 
Comments

FOLLOW
 TOLLYWOOD