ఆ రెండు చిత్రాల్లో హిట్ అయ్యేది ఏదో ?
TOLLYWOOD
 TOPSTORY

ఆ రెండు చిత్రాల్లో హిట్ అయ్యేది ఏదో ?

Murali R | Published:December 17, 2017, 5:59 AM IST

ఈనెల 21న నాని నటించిన "ఎం సి ఏ " మిడిల్ క్లాస్ అబ్బాయి , 22న అఖిల్ హీరోగా నటించిన " హలో" చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఒక్కరోజు తేడాతో వస్తున్న ఈ రెండు చిత్రాలపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. నాని వరుసగా విజయాలు సాధిస్తుండటంతో పాటుగా దిల్ రాజు నిర్మించిన చిత్రం కాబట్టి సహజంగానే ఎం సి ఏ పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. పైగా వరంగల్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కూడా కావడంతో సెంటిమెంట్ పరంగా కూడా నాని సినిమా పైనే మొగ్గు ఎక్కువగా ఉంది.

 

ఇక అఖిల్ నటించిన హలో సినిమా విషయానికి వస్తే మొదట హీరోగా నటించిన అఖిల్ చిత్రం ఘోర పరాజయం పొందడంతో ఈ హలో పై చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు నాగార్జున. మనం వంటి క్లాసికల్ హిట్ ని ఇచ్చిన విక్రమ్ కుమార్ దర్శకుడు కావడంతో అఖిల్ హలో చిత్రంపై కూడా ఆసక్తి నెలకొంది. నాని సినిమాతో పాటుగా రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో హలో విజయం సాధిస్తుందా ? లేక నాని ఎం సి ఏ నా ? అన్న ఆత్రుత నెలకొంది. మరి ఈ రెండు చిత్రాల్లో ఏది విజయం సాధిస్తుందో తెలియాలంటే ఈనెల 22 వరకు ఎదురు చూడాల్సిందే.
Comments

FOLLOW
 TOLLYWOOD