టీజర్ తో పలకరించడానికి వస్తున్న అఖిల్
TOLLYWOOD
 TOPSTORY

టీజర్ తో పలకరించడానికి వస్తున్న అఖిల్

Murali R | Published:November 14, 2017, 6:25 PM IST

అక్కినేని అఖిల్ తన మొదటి చిత్రం అఖిల్ తో ప్రేక్షకులను నిరాశ పరిచినప్పటికీ హీరో మెటీరియల్ ఉందని మాత్రం నిరూపించుకున్నాడు . అయితే మొదటి సినిమా ఇచ్చిన షాక్ వల్ల కొంతకాలం గ్యాప్ తీసుకున్నాడు , కట్ చేస్తే మనం వంటి క్లాసికల్ హిట్ ని అక్కినేని ఫ్యామిలీ కి ఇచ్చిన విక్రమ్ కుమార్ అఖిల్ రెండో సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో '' హలో '' సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి . అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కాగా ఈనెల 16న హలో టీజర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఆ మేరకు అఖిల్ అక్కినేని ఈ విషయాన్నీ ట్వీట్ చేసాడు . అఖిల్ సరసన ప్రియదర్శన్ - లిజి ల కూతురు కళ్యాణి హీరోయిన్ గా నటిస్తోంది . ప్రేమ కథకు యాక్షన్ ని జోడించి చేస్తున్న హలో సినిమాపై అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
Comments

FOLLOW
 TOLLYWOOD