ఫ్యాన్స్ కి సారీ చెప్పిన నాగచైతన్య
TOLLYWOOD
 TOPSTORY

ఫ్యాన్స్ కి సారీ చెప్పిన నాగచైతన్య

Tuesday September 12th 2017
యుద్ధం శరణం మంచి హిట్ అయి అభిమానులను అలరిస్తుందని అనుకున్నాడు అక్కినేని నాగచైతన్య కానీ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ కావడంతో అక్కినేని ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నాడు దాంతో వాళ్లందరికీ సారీ చెప్పాడు చైతూ . ఈనెల 8న యుద్ధం శరణం సినిమా రిలీజ్ అయ్యింది . తన చిన్ననాటి స్నేహితుడు కావడంతో కృష్ణ మారిముత్తు కి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు చైతూ కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ సినిమా ఘోర పరాజయం పొందింది.

చైతూ కి వరుసగా ప్రేమమ్ , రారండోయ్ వేడుక చూద్దాం అనే సినిమాలు సక్సెస్ సాధించాయి దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల తో పాటుగా అక్కినేని ఫ్యాన్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కట్ చేస్తే యుద్ధం లో ఘోర పరాజయం లభించింది నాగచైతన్య కి , చైతూ కి కూడా బాధ ఉంది కానీ అక్కినేని ఫ్యాన్స్ ఇంకా బాధపడుతున్నారు . ఇక కొంతమంది అభిమానులు అయితే సోషల్ మీడియాలో , వాట్సాప్ లో చైతూ కి తమ బాధ వెళ్లబోసుకున్నారు . దాంతో తనకంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసుకొని వాళ్ళని బాధపెట్టినందుకు క్షమాపణ కోరాడు.


Comments

FOLLOW
 TOLLYWOOD