డైలమాలో నాగచైతన్య
TOLLYWOOD
 TOPSTORY

డైలమాలో నాగచైతన్య

Murali R | Published:September 13, 2017, 12:00 AM IST
యుద్ధం శరణం చిత్రం ఘోర పరాజయం పొందడంతో అక్కినేని నాగచైతన్య డైలమాలో పడ్డాడు . యాక్షన్ ఇమేజ్ కోసం అక్కినేని నాగచైతన్య ఎప్పటి నుండో రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు పాపం ! కానీ ఒక్కటే '' తడాకా '' హిట్ అయ్యింది తప్ప మిగతా సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి . తాజాగా యుద్ధం శరణం కూడా ప్లాప్ కావడంతో ఇక తదుపరి ఏ సినిమా చేయాలా అన్న సంశయం లో ఉన్నాడు చైతూ.

సరిగ్గా ఇదే సమయంలో ఈనెల 20న చందు మొండేటి సినిమా ప్రారంభం కావాల్సి ఉంది కానీ దాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లాలా ? వద్దా ? అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు . మరో విషయం ఏంటంటే ...... దర్శకులు మారుతి దర్శకత్వంలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చైతూ . అయితే చందు మొండేటి సినిమా యాక్షన్ తో కూడుకున్న సినిమా కాబట్టి అది ఇప్పటికే దెబ్బలు తగిలాయి కాబట్టి మారుతి సినిమాని ముందుగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట . ఇక మారుతి దర్శకత్వం వహించిన సినిమా మహానుభావుడు ఈనెల 29న రిలీజ్ అవుతుంది కాబట్టి కొద్దిరోజులు వేచి చూసే ధోరణి లో ఉన్నాడట చైతూ.Comments

FOLLOW
 TOLLYWOOD