ఆ సినిమాని రిజెక్ట్ చేయడానికి కారణం తెలుసా
TOLLYWOOD
 TOPSTORY

ఆ సినిమాని రిజెక్ట్ చేయడానికి కారణం తెలుసా

Murali R | Published:August 10, 2017, 12:00 AM IST
అందాల భామ ఐశ్వర్య రాయ్ తో కలిసి నటించే అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు కానీ ఓ యంగ్ హీరో మాత్రం ఆ బంగారం లాంటి ఛాన్స్ ని వదులుకున్నాడు , ఐశ్వర్య సినిమా చేయనని రిజెక్ట్ చేసాడు . ఇంతకీ ఐశ్వర్య సినిమాను రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా ....... వివేక్ ఒబెరాయ్ తమ్ముడు అక్షయ్ ఒబెరాయ్ . దాంతో అక్షయ్ స్థానంలో మరో హీరో ని సెలెక్ట్ చేసే పనిలో పడ్డారు ఆ చిత్ర దర్శక నిర్మాతలు . 

 

 

వివేక్ ఒబెరాయ్ - ఐశ్వర్య రాయ్ లు అప్పట్లో ప్రేమించుకున్న విషయం తెలిసిందే . త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అంటూ వివేక్ ఒబెరాయ్ స్వయంగా ప్రకటించాడు కూడా కట్ చేస్తే ఏం జరిగిందో తెలియదు  వివేక్ - ఐశ్వర్య లు విడిపోయారు . అభిషేక్ ని పెళ్లి చేసుకొని ఒక బిడ్డ కు తల్లి కూడా అయ్యింది ఐశ్వర్య . ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది . రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో '' ఫ్యాని ఖాన్ '' అనే చిత్రంలో నటించడానికి అంగీకరించింది . 
Comments

FOLLOW
 TOLLYWOOD