ఆ సినిమా ఆగిపోలేదట
TOLLYWOOD
 TOPSTORY

ఆ సినిమా ఆగిపోలేదట

Murali R | Published:August 12, 2017, 12:00 AM IST
అల్లు అర్జున్ హీరోగా తెలుగు , తమిళ భాషలలో ద్విభాషా చిత్రం ఒకటి అప్పట్లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే . లింగుస్వామి దర్శకత్వంలో జ్ఞాన వేల్ రాజా నిర్మించనున్న చిత్రం అట్టహాసంగా చెన్నై లో ప్రారంభం అయ్యింది . అయితే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళాల్సింది పోయి ఇప్పుడు ''నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా '' అనే సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది . దాంతో అల్లు అర్జున్ తమిళ సినిమా ఆగిపోయినట్లే అని గుసగుసలు ప్రచారంలోకి రావడంతో ఎట్టకేలకు స్పందించారు ఆ చిత్ర బృందం.

ఆ సినిమా ఆగిపోలేదని , ఒకవైపు అల్లు అర్జున్ బిజీ గా ఉన్నాడు అలాగే మరోవైపు దర్శకులు లింగుస్వామి కూడా పందెం కోడి సీక్వెల్ చిత్రంతో బిజీ గా ఉన్నాడు కాబట్టి వాళ్లిద్దరూ ఆ రెండు సినిమాలను కంప్లీట్ చేసాక ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుందని అంటున్నారు జ్ఞానవేల్ రాజా.Comments

FOLLOW
 TOLLYWOOD