బన్నీ షూటింగ్ ఎందుకు ఆపేశాడో తెలుసా
TOLLYWOOD
 TOPSTORY

బన్నీ షూటింగ్ ఎందుకు ఆపేశాడో తెలుసా

Murali R | Published:January 13, 2017, 12:00 AM IST
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం చిత్ర షూటింగ్ ఆపేసాడు . దర్శకులు హరీష్ శంకర్ కూడా డీజే షూటింగ్ ని ఆపేసాడు . ఇంతకీ ఈ ఇద్దరూ దువ్వాడ జగన్నాధం షూటింగ్ ని ఎందుకు ఆపేశారో తెలుసా ........ ...... చిరంజీవి కోసం . మెగాస్టార్ నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రాన్ని చూడటం కోసం . అవును మెగాస్టార్ చిరంజీవి కి ఈ ఇద్దరు కూడా హార్డ్ కొర్ ఫ్యాన్స్ అన్న విషయం తెలిసిందే . దాంతో బాస్ సినిమా రిలీజ్ రోజు షూటింగ్ పెట్టుకోవడం ఏంటి ? బాస్ సినిమా చూసి ఫుల్లుగా ఎంజాయ్ చేయాలి కానీ అంటూ దువ్వాడ జగన్నాధం కు బ్రేక్ ఇచ్చారు . 
 
 

ఈరోజు ప్రేక్షకుల మధ్య బాస్ సినిమా చూడటానికి వెళ్లారు అల్లు అర్జున్ - హరీష్ శంకర్ లు . చిరంజీవి రీ ఎంట్రీ సినిమా కావడంతో ఖైదీ నెంబర్ 150 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి . ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న దువ్వాడ జగన్నాధం చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే . ఆ సినిమా షూటింగ్ దాదాపు 40 శాతం పూర్తయ్యిందట . వేసవిలో పక్కగా రిలీజ్ చేస్తాం అని అంటున్నాడు హరీష్ . 
Comments

FOLLOW
 TOLLYWOOD