రెండు రోజులు ఆగమంటున్న అల్లు అర్జున్
TOLLYWOOD
 TOPSTORY

రెండు రోజులు ఆగమంటున్న అల్లు అర్జున్

Murali R | Published:February 16, 2017, 12:00 AM IST

రెండు రోజుల పాటు వెయిట్ చేయండి కావలసినంత కిక్ ఇస్తాను అని అంటున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. గబ్బర్ సింగ్ దర్శకులు హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం దువ్వాడ జగన్నాధం . అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని ఈనెల 18న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 18 కి మరో రెండు రోజుల గడువు ఉండటంతో రెండు రోజులు ఆగండి దువ్వాడ జగన్నాధం స్టైల్ ఏంటో చూపిస్తాను అని అంటున్నాడు.

అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం పోషిస్తున్న ఈ చిత్రం పై బన్నీ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో హరీష్ కూడా చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఎందుకంటే గబ్బర్ సింగ్ వంటి సంచలన విజయం తర్వాత ఎక్కడికో వెళ్లిపోతాను అని అనుకున్నాడు హరీష్ కానీ దెబ్బ కొట్టింది. దాంతో స్టార్ డం కోసం బాగానే కష్టపడుతున్నాడు హరీష్ .
Comments

FOLLOW
 TOLLYWOOD