కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్న అల్లు అర్జున్
TOLLYWOOD
 TOPSTORY

కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్న అల్లు అర్జున్

Murali R | Published:December 16, 2017, 8:14 AM IST
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా వక్కంతం వంశీ దర్శకత్వంలో '' నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా '' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఆ సినిమా ఇంకా సెట్స్ పై ఉండగానే కొత్త సినిమాలు అంగీకరిస్తున్నాడు . తాజాగా ఓ కొత్త దర్శకుడు ని ఎంకరేజ్ చేయాలనీ డిసైడ్ అయ్యాడట . సంతోష్ రెడ్డి అనే యువ దర్శకుడు చెప్పిన కథ అల్లు అర్జున్ కు నచ్చడంతో మనం ఈ సినిమా చేస్తున్నాం అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట . ఇప్పటికే వక్కంతం వంశీ కి డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చాడు అల్లు అర్జున్ . 

 

తాజాగా మరో కొత్త దర్శకుడికి అవకాశం ఇస్తున్నాడు . కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వడం అంటే మాటలు కాదు ఎందుకంటే స్టార్ హీరోలకు కొత్త వాళ్లతో చేయడం కొంత ఇబ్బందే .... అయినప్పటికీ సంతోష్ అనే దర్శకుడి ని పరిచయం చేయడానికి నిర్ణయించు కొన్నాడట బన్నీ . మొత్తానికి టెక్నాలజీ పుణ్యమా అని కొత్త వాళ్ళు ఇండస్ట్రీ కి చాలామందే వస్తున్నారు . అల్లు అర్జున్ సాహసం చేస్తున్నప్పటికీ సక్సెస్ అయితే అది అల్లు అర్జున్ క్రెడిట్ లోనే పడుతుంది కదా ! అందుకే ఈ సాహసం . 
Comments

FOLLOW
 TOLLYWOOD