పవన్ డైలాగ్ చెప్పిన అల్లు అర్జున్
TOLLYWOOD
 TOPSTORY

పవన్ డైలాగ్ చెప్పిన అల్లు అర్జున్

Murali R | Published:June 12, 2017, 12:00 AM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పూర్తితో రాసుకున్న డైలాగ్ ని అల్లు అర్జున్ చేత చెప్పించాడు దర్శకులు హరీష్ శంకర్ . ఇంతకీ పవన్ చెప్పిన ఆ డైలాగ్ ఏంటో తెలుసా ........ మనం చేసే పనిలో మంచి కనబడాలి తప్ప ....... మనిషి కాదు '' ఈ డైలాగ్ హరీష్ శంకర్ కు పవన్ చెప్పాడట ఆ డైలాగ్ ని ఇప్పుడు అల్లు అర్జున్ కోసం దువ్వాడ జగన్నాథం చిత్రం కోసం రాసాడు హరీష్ శంకర్ . పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ చిత్రం చేసిన విషయం తెలిసిందే .
 
 

నిన్న హైదరాబాద్ లో దువ్వాడ జగన్నాథం చిత్ర ఆడియో వేడుక జరిగింది , కాగా ఆ వేడుకలో ఈ విషయాన్నీ చెప్పాడు హరీష్ . ఇక ఈ సినిమా పెద్ద హిట్ కావడం ఖాయమని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి విజిల్ వేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాడు దర్శకులు హరీష్ . అయితే పవన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని నీడలా వెంటాడుతుంటే అదే పవన్ డైలాగ్ ని అల్లు అర్జున్ చేత చెప్పించడం విశేషమే మరి . 
Comments

FOLLOW
 TOLLYWOOD