ఆ సినిమాకు కాపీ కాదని అంటున్న అల్లు శిరీష్
TOLLYWOOD
 TOPSTORY

ఆ సినిమాకు కాపీ కాదని అంటున్న అల్లు శిరీష్

Murali R | Published:December 18, 2017, 6:20 AM IST
అల్లు శిరీష్ తాజాగా '' ఒక్క క్షణం '' చిత్రంలో నటిస్తున్నాడు , ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన వి ఐ ఆనంద్ ఈ ఒక్క క్షణం చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో ప్రాజెక్ట్ కి మంచి క్రేజ్ ఏర్పడింది . నిన్నటితో ఒక్క క్షణం చిత్ర నిర్మాణం పూర్తయ్యింది ,ఇక ఈనెల 28న రిలీజ్ కావడమే తరువాయి . అయితే ఒక్క క్షణం పై ఒక్కసారిగా ఆరోపణలు చుట్టుముట్టాయి , ఓ కొరియా సినిమాని కాపీ కొట్టి తెలుగులో చేస్తున్నారని ఫిలిం ఛాంబర్ లో నిర్మాత అనిల్ సుంకర ఫిర్యాదు చేయడంతో దానికి మాకు సంబంధం లేదని అంటున్నాడు అల్లు శిరీష్ . 

 

రెండు జంటల మధ్య ప్యారలల్ గా సాగే కథ మాది , ఇక కొరియా సినిమా నేను చూసాను దానికి మాకు పోలికే లేదు ..... మరో పదిరోజుల్లో మా సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పుడే తెలిసిపోతుంది అని అంటున్నాడు అల్లు శిరీష్ . కొరియా సినిమా హక్కులు తీసుకున్న అనిల్ సుంకర తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్టున్నాడు , మరో పది రోజుల్లో ఒక్క క్షణం సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి అసలు విషయం తేలిపోనుంది . 
Comments

FOLLOW
 TOLLYWOOD