అర్జున్ రెడ్డి పై అనసూయ ఆగ్రహం
TOLLYWOOD
 TOPSTORY

అర్జున్ రెడ్డి పై అనసూయ ఆగ్రహం

Murali R | Published:August 31, 2017, 12:00 AM IST
అర్జున్ రెడ్డి అలియాస్ విజయ్ దేవరకొండ పై హాట్ భామ అనసూయ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది . సినిమా మంచి హిట్ అయ్యింది , చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు కానీ సినిమా రిలీజ్ సమయంలో మహిళల పై చులకనగా మాట్లాడటం అవసరమా ? అంటూ విజయ్ దేవరకొండ ని ప్రశ్నిస్తోంది అనసూయ . అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో విజయ్ దేవరకొండ '' ఫక్ '' అంటూ పదేపదే అసభ్య పదజాలాన్ని వాడిన విషయం తెలిసిందే . ఒకటి రెండుసార్లు కాదు చాలాసార్లు వాడాడు దాంతో ఇప్పుడు స్పందిస్తోంది అనసూయ.

నీ పద్దతి బాగోలేదు బ్రదర్ ! అంటూ అర్జున్ రెడ్డి అలియాస్ విజయ్ దేవరకొండ కు క్లాస్ పీకింది అనసూయ . అయితే అనసూయ క్లాస్ పీకిన తర్వాత సోషల్ మీడియా లో ఆమెకు కూడా పెద్ద ఎత్తున రివర్స్ లో పాఠాలు నేర్పుతున్నారు నెటిజన్లు . నువ్ యాంకర్ చేస్తున్న జబర్దస్త్ లో ఎన్ని బూతులు ఉన్నాయో చూసుకో అలాగే మహిళలపై ఘోరమైన స్కిట్ లు వేస్తున్నారు అంటూ అనసూయ ని ఆడుకుంటున్నారు నెటిజన్లు . విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి భారీ విజయం సాధించినప్పటికీ పలు వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి . మరి అనసూయ తీసుకున్న క్లాస్ కు విజయ్ ఎలా సమాధానం ఇస్తాడో చూడాలి.

Related Links

Anasuya fire on netizens
anasuya hot dance at buddah statue
vijay devarakonda marriage newsComments

FOLLOW
 TOLLYWOOD