ఈ యాంకర్ హీరోగా సక్సెస్ అవుతాడా
TOLLYWOOD
 TOPSTORY

ఈ యాంకర్ హీరోగా సక్సెస్ అవుతాడా

Murali R | Published:October 17, 2017, 2:10 PM IST
బుల్లితెర మీద యాంకర్ గా సత్తా చాటిన ప్రదీప్ త్వరలోనే హీరోగా పరిచయం కానున్నాడు . ఇప్పటికే పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసాడు ప్రదీప్ , అయితే ఎప్పటి నుండో హీరోగా నటించాలని ఆశపడుతున్నాడు కానీ అదృష్టం మాత్రం కలిసి రాలేదు దాంతో వాయిదా పడుతూనే ఉంది . అప్పట్లో అగ్ర నిర్మాత అశ్వనీదత్ కూతురు ప్రదీప్ ని హీరోగా పరిచయం చేయబోతున్నాం అని ప్రకటించింది కూడా కానీ అది కూడా వర్కౌట్ కాలేదు దాంతో బుల్లితెర పై పలు ప్రోగ్రాం లు చేస్తూనే ఉన్నాడు.

అయితే ప్రదీప్ కి కొన్ని వర్గాల అండ ఉండటంతో మళ్ళీ హీరోగా ప్రయత్నాలు చేస్తున్నాడు , త్వరలోనే ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటిస్తారట . ఓ కొత్త దర్శకుడడి దర్శకత్వంలో ప్రదీప్ హీరోగా నటించనున్నాడు . అయితే బుల్లితెర పై యాంకర్ గా సక్సెస్ అయిన ప్రదీప్ వెండితెర పై హీరోగా సక్సెస్ అవుతాడా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే!Comments

FOLLOW
 TOLLYWOOD