అనిల్ ప్రాజెక్ట్ ఆ హీరో తో ఇంకా సెట్ కాలేదట
TOLLYWOOD
 TOPSTORY

అనిల్ ప్రాజెక్ట్ ఆ హీరో తో ఇంకా సెట్ కాలేదట

Murali R | Published:October 26, 2017, 4:31 PM IST
తాజాగా రాజా ది గ్రేట్ చిత్రంతో హ్యాట్రిక్ అందుకున్న అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని హీరో నితిన్ తో చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి అయితే ఆ వార్తలన్నీ నిజం కాదని అసలు ఇంకా ఏ హీరోకు కూడా కథ చెప్పలేదని ఏదైనా ఉంటే నేనే స్వయంగా చెబుతానని అంటున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి . నందమూరి కళ్యాణ్ రామ్ తో పటాస్ వంటి బ్లాక్ బస్టర్ ని అందించి దర్శకుడిగా పరిచయమయ్యాడు అనిల్ రావిపూడి , దాని తర్వాత సాయి ధరమ్ తేజ్ హీరోగా సుప్రీమ్ చేసాడు అది కూడా హిట్ అయ్యింది ఇక ఇప్పుడేమో రవితేజ తో రాజా ది గ్రేట్ చిత్రం చేసి హ్యాట్రిక్ కొట్టాడు దాంతో అనిల్ రావిపూడి కి మంచి డిమాండ్ ఏర్పడింది.

అనిల్ డిమాండ్ ఉండటంతో , మినిమమ్ గ్యారెంటీ చిత్రాలు తీస్తుండటంతో అతడితో సినిమా చేయాలనీ పలువురు హీరోలు పోటీపడుతున్నారు . ఇంకేముంది అనిల్ తో ఫలానా హీరో సినిమా చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి . ఆకోవలో భాగంగానే హీరో నితిన్ తో సినిమా చేయనున్నాడు అని వార్తలు వచ్చాయి అయితే అది నిజం కాదని ఏదైనా విషయం ఉంటే నేనే చెబుతానని స్పష్టం చేసాడు దర్శకుడు అనిల్ రావిపూడి.Comments

FOLLOW
 TOLLYWOOD