మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
TOLLYWOOD
 TOPSTORY

మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

Murali R | Published:June 16, 2017, 12:00 AM IST
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్ ........ మహేష్ సినిమా ఎలాగూ ఆలస్యం అవుతోంది కాబట్టి మహేష్ పుట్టినరోజు నాటికి కనీసం టీజర్ నైనా చూసి తరించండి అంటూ స్పైడర్ టీజర్ ని రిలీజ్ చేయడానికి ముహూర్తం నిర్ణయించారు . ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు అన్న విషయం అందరికీ తెలిసిందే . పుట్టినరోజు కానుకగా ఒకరోజు ముందే అంటే ఆగస్టు 8న సాయంత్రం స్పైడర్ కొత్త టీజర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే స్పైడర్ టీజర్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . కాగా దాన్ని మించేలా కొత్త టీజర్ ని రెడీ చేస్తున్నారు . మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న ఈ స్పైడర్ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ కానుంది . మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్ , ఠాగూర్ మధు లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.Comments

FOLLOW
 TOLLYWOOD