ఆ సినిమా టైటిల్ మారనుందట
TOLLYWOOD
 TOPSTORY

ఆ సినిమా టైటిల్ మారనుందట

Murali R | Published:May 19, 2017, 12:00 AM IST
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ లో అదరగొట్టడంతో తదుపరి చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి . ఖైదీ నెంబర్ 150 తో భారీ వసూళ్ల ని సాధించాడు చిరు . దాంతో తదుపరి చిత్రం మరిన్ని రికార్డులు బద్దలు కొట్టాలని భావించిన చిరు అండ్ కో '' ఉయ్యాలవాడ నరసింహారెడ్డి '' చిత్రాన్ని చేయడానికి రంగం సిద్ధం చేసారు . అయితే మొదట్లో ఈ సినిమా ఒక్క తెలుగు భాషలోనే చేయాలనీ అనుకున్నారు అందుకే టైటిల్ గా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా నామకరణం చేసారు . అయితే బాహుబలి 2 ప్రభంజనం తో తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది కాబట్టి ఉయ్యాలవాడ సినిమాని తెలుగు లోనే కాకుండా తమిళ , హిందీ భాషలలో కూడా డబ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు .
 
 

అందుకే ఉయ్యాలవాడ నరసింహారెడ్ట్ టైటిల్ ని మార్చాలని డిసైడ్ అయ్యారట . కామన్ టైటిల్ పెట్టాలని భావిస్తున్నారట దాంతో టైటిల్ మారడం ఖాయమని అంటున్నారు . చిరంజీవి స్వాతంత్య్ర సమరయోధుడిగా నటించనున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా చరణ్ నిర్మిస్తున్నాడు . 
Comments

FOLLOW
 TOLLYWOOD