జై లవకుశ పై దుష్ప్రచారం
TOLLYWOOD
 TOPSTORY

జై లవకుశ పై దుష్ప్రచారం

Murali R | Published:September 13, 2017, 12:00 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ పై దుష్ప్రచారం చేస్తున్నారు కొంతమంది . ఏ హీరో సినిమా రిలీజ్ అవుతున్నా ఆ హీరో ని వ్యతిరేకించే బ్యాచ్ లంటూ కొన్ని ఉన్నాయి వాళ్ళు సోషల్ మీడియాలో ఫుల్లుగా యాక్టివ్ గా ఉంటారు . టీజర్ , ట్రైలర్ రావడమే ఆలస్యం దాన్ని విమర్శిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు అలాగే సినిమా విషయంలో కూడా . తాజాగా ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ అదే చేస్తున్నారు జై లవకుశ విషయంలో . ఈ సినిమా చిరంజీవి నటించిన రౌడీ అల్లుడు లా ఉందని కొన్ని షాట్ లను కట్ చేసి మరీ సోషల్ మీడియాలో పెడుతున్నారు . రౌడీ అల్లుడు , జై లవకుశ ల మద్య పోలికలను చూపిస్తున్నారు.

అంతేకాదు చిరంజీవి నటించిన ముగ్గురు మొనగాళ్ళు చిత్రాన్ని కూడా ఉదహరిస్తున్నారు . ఇదంతా ఎందుకంటే ఎన్టీఆర్ కూడా త్రిపాత్రాభినయం పోషించడం ఒక కారణమైతే , రౌడీ అల్లుడు చిత్రంలోలా  కొన్ని సన్నివేశాలు కనిపిస్తున్డటం తో ఈ పోలిక వచ్చింది . అయితే  జై లవకుశ  సినిమా  రిలీజ్ అయితే కానీ తెలీదు ఈ పోలికలు ఉన్నాయా ? లేదా ? అనేది . అంతేనా ఓ హాలీవుడ్ సినిమాకు కాపీ అని కూడా ప్రచారం జరుగుతోంది . అన్నింటికీ సమాధానం కావాలంటే ఈనెల 21 వరకు ఎదురు చూడాల్సిందే.
Comments

FOLLOW
 TOLLYWOOD