అనుష్క ని ఇబ్బంది పెడుతున్న మహేష్
TOLLYWOOD
 TOPSTORY

అనుష్క ని ఇబ్బంది పెడుతున్న మహేష్

Murali R | Published:May 19, 2017, 12:00 AM IST
సాలిడ్ అందాల భామ అనుష్క తాజాగా భాగమతి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . యువి క్రియేషన్స్ పతాకం పై అశోక్ దర్శకత్వంలో భాగమతి సినిమా రూపొందుతోంది . చిత్ర నిర్మాణం పూర్తయ్యింది ఆగస్టు లో రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు అయితే అనుష్క భాగమతి చిత్రానికి ఇప్పుడు మహేష్ అడ్డు తగులుతున్నాడు . మహేష్ కి అనుష్క సినిమాకు లింక్ ఏంటి ? అని అనుకుంటున్నారా ? మహేష్ సినిమా కూడా ఆగస్టు లో రిలీజ్ చేద్దామని అనుకున్నారు .
 
 

అయితే మహేష్ సినిమా రిలీజ్ అయితే అదే సమయంలో అనుష్క సినిమా కూడా రిలీజ్ అయితే తప్పకుండా ఇబ్బంది అవుతుంది అందుకే మహేష్ స్పైడర్ రిలీజ్ అయితే దానికి రెండు వారాల గడువు ఇచ్చి ఆ తర్వాత భాగమతి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు . కానీ మహేష్ సినిమా రిలీజ్ టైం ఎప్పుడో తెలియడం లేదు వాయిదా పడుతుందని కూడా అంటున్నారు . మహేష్ డేట్ ఫిక్స్ అయితే అప్పుడు అనుష్క సినిమా రిలీజ్ ఉంటుంది . 
Comments

FOLLOW
 TOLLYWOOD