రాజమౌళి డిజైన్ ని రిజెక్ట్ చేశారు
TOLLYWOOD
 TOPSTORY

రాజమౌళి డిజైన్ ని రిజెక్ట్ చేశారు

Murali R | Published:December 13, 2017, 3:31 PM IST

బాహుబలి తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. కాగా ఆంద్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం జక్కన్న సలహాలు సూచనలు తీసుకుంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అమరావతి నిర్మాణాలలో తెలుగు వైభవం ఉట్టి పడేలా ఆకృతు లు ఉండాలని భావిస్తున్నారు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాంతో జక్కన్న సలహాలు తీసుకుంటున్నాడు.

 

అయితే అమరావతి లో నిర్మించే నిర్మాణాలలో జక్కన్న తన ఆలోచనలకు అనుగుణంగా సలహాలు సూచనలు ఇస్తున్నాడు కానీ వాటిని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాడు.కారణం జక్కన్న ఇచ్చిన ఆకృతులు చంద్రబాబు కు నచ్చకపోవడమే. జక్కన డిజైన్ నచ్చలేదు కానీ అతడు ఇచ్చిన కొన్ని సలహాలను మాత్రం తీసుకున్నారు. అమరావతి నిర్మాణంలో నా పాత్ర ఏమి లేదు పైగా నేను ఇచ్చిన డిజైన్లు ముఖ్యమంత్రి కి నచ్చలేదు కూడా కాకపోతే రామసేతు నిర్మాణంలో ఉడత మాదిరిగా నా వంతు సహకారం అందిస్తున్నాను అంతే అని అన్నారు జక్కన్న .




Comments

FOLLOW
 TOLLYWOOD