ఆసుపత్రి పాలైన అర్జున్ రెడ్డి హీరోయిన్
TOLLYWOOD
 TOPSTORY

ఆసుపత్రి పాలైన అర్జున్ రెడ్డి హీరోయిన్

Murali R | Published:September 13, 2017, 12:00 AM IST
అర్జున్ రెడ్డి చిత్రంలో నటించిన షాలిని పాండే స్వల్ప అస్వస్థత కి గురవ్వడంతో నెల్లూరు లోని ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు . అక్కడ ప్రాధమిక చికిత్స తీసుకున్న అనంతరం కొద్దిసేపు అక్కడే విశ్రాంతి తీసుకుంది . నెల్లూరు కి ఓ సెల్ ఫోన్ ఓపెనింగ్  కోసం వెళ్ళింది షాలిని పాండే  . అర్జున్ రెడ్డి హీరోయిన్ నెల్లూరు వస్తోంది అని తెలియగానే పెద్ద ఎత్తున కుర్రకారు నెల్లూరు కి క్యూ కట్టారు దాంతో నెల్లూరు పట్టణం క్రిక్కిరిసిపోయింది.

ఇక షాపింగ్ ఓపెనింగ్ దగ్గర షాలిని పాండే ని దగ్గర నుండి చూడటానికి కుర్రాళ్ళు ఎగబడటంతో తోపులాట ఎక్కువయ్యింది . దాంతో షాలిని పాండే తీవ్ర అస్వస్థత కి గురయ్యింది , కళ్ళు తిరిగి పడిపోబోతుండగా వెంటనే అప్రమత్తమైన సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించారు . ఇటీవలే అర్జున్ రెడ్డి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ భామ . ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవ్వడంతో షాలిని పాండే కి విపరీతమైన క్రేజ్ వచ్చింది.Comments

FOLLOW
 TOLLYWOOD