అర్జున్ రెడ్డి కి ఆవేశం ఎక్కువే
TOLLYWOOD
 TOPSTORY

అర్జున్ రెడ్డి కి ఆవేశం ఎక్కువే

Murali R | Published:August 30, 2017, 12:00 AM IST
అర్జున్ రెడ్డి అలియాస్ విజయ్ దేవరకొండ కి ఆవేశం ఎక్కువే అనిపిస్తోంది . ఇప్పటికే తన చర్యల ద్వారా ఆవేశాన్ని వెళ్లగక్కిన విజయ్ పాపం ! కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి . హన్మంతరావు పై '' చిల్ తాతయ్యా '' అంటూ గాలి తీసి పడేస్తున్నాడు . ఇంతకుముందు సినిమా రిలీజ్ కాకుండానే ఈ నాయకుడి గాలి తీసిన విజయ్ దేవరకొండ మరోసారి మరింత అగ్రెసివ్ గా రెస్పాండ్ అయి మరింత సంచలనం సృష్టించాడు . విజయ్ దేవరకొండ వేసిన ట్వీట్ కుర్రాళ్లకు మరింత హుషారు నిస్తుండగా కొంతమంది కి మాత్రం నచ్చడం లేదు దాంతో అర్జున్ రెడ్డి సినిమా బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమా అని , సైకో గాళ్ళ సినిమా అని ఇలాంటి సినిమాలు వస్తే ప్రేక్షకులు ఆదరిస్తే ....... సినిమావాళ్ళ తో పాటుగా రాజకీయ నాయకులు కొంతమంది మెచ్చుకోవడం విడ్డూరంగా ఉందని దీని వల్ల సైకో గాళ్ళు మరింతగా వీరంగం వేయడం ఖాయమని సోషల్ మీడియాలో తిడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు.

అయితే అర్జున్ రెడ్డి సినిమాని పొగుడుతున్న వాళ్ళ కంటే తిడుతున్న వాళ్ళ సంఖ్య తక్కువే ! సోషల్ మీడియా వార్ ఎలా ఉన్నప్పటికీ విజయ్ దేవరకొండ మాత్రం కాస్త అగ్రెసివ్ గానే రెస్పాండ్ అవుతున్నాడు . ఎదిగే సమయంలో కాస్త తగ్గి ఉంటే మరింత ఎత్తుకు ఎదగొచ్చు . కాబట్టి వివాదాలు వస్తూనే ఉంటాయి కాబట్టి వాటికి కాస్త దూరంగా ఉంటే విజయ్ దేవరకొండ మరిన్ని విజయ తీరాలను చేరడం ఖాయం.

Related Links

Arjun Reddy Movie Review
Arjun Reddy inspired Reddy to get titles
Vijay Devarakonda tweet on V HanmantharaoComments

FOLLOW
 TOLLYWOOD