ఆ దర్శక నిర్మాతల అరెస్ట్ తప్పదా
TOLLYWOOD
 TOPSTORY

ఆ దర్శక నిర్మాతల అరెస్ట్ తప్పదా

Murali R | Published:September 29, 2017, 2:00 AM IST
వంగవీటి చిత్రాన్ని నిర్మించిన దాసరి కిరణ్ కుమార్ ని అలాగే దర్శకుడు రాంగోపాల్ వర్మ ని అరెస్ట్ చేయాలంటూ విజయవాడ కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. తక్షణం ఆ ఇద్దరి పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ పోలీసులను ఆదేశించింది విజయవాడ కోర్టు. వంగవీటి సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టుకెక్కాడు మాజీ ఎం ఎల్ ఏ వంగవీటి రాధాకృష్ణ.

దాంతో నెలరోజుల పాటు విచారణ సాగించిన అనంతరం వర్మ పై గ్రహం వ్యక్తం చేస్తూ వంగవీటి రాధాకృష్ణ అభ్యంతరాలను పట్టించుకోక పోవడంతో తక్షణం దర్శక నిర్మాతలను అరెస్ట్ చేయాల్సిందిగా పోలీసులకు ఉత్తర్వులు జారీచేసింది. అయితే దర్శక నిర్మాతలను తక్షణమే అరెస్ట్ చేస్తారా చూడాలి ఎందుకంటే హై కోర్టు కి వెళతారా ? లేక న్యాయస్థానం మీద గౌరవం తో కోర్టు ముందు హాజరుఅవుతారా చూడాలి. టైటిల్ వంగవీటి అయినప్పటికీ  సినిమాలో వంగవీటి మోహన్ రంగా ని రౌడీ గా చూపించారని రంగా తనయుడు రాధాకృష్ణ కోర్టుకెక్కాడు. Comments

FOLLOW
 TOLLYWOOD