పాపం ! ఆ హీరో
TOLLYWOOD
 TOPSTORY

పాపం ! ఆ హీరో

Murali R | Published:July 16, 2017, 12:00 AM IST
బాలీవుడ్ అందగాడు రణబీర్ కపూర్ హీరోగా అయితే అందరి మెప్పు పొందాడు కానీ సరైన సక్సెస్ మాత్రం లభించడం లేదు . తాజాగా ఈ హీరో తన మాజీ ప్రియురాలు కత్తిలాంటి కత్రినా కైఫ్ తో కలిసి నటించిన చిత్రం '' జగ్గా జాసూస్ ''. గత శుక్రవారం రోజున రిలీజ్ అయిన ఈ సినిమాకు అంతగా కలెక్షన్లు రావడం లేదు . రెండు రోజుల్లో కేవలం 20 కోట్లు మాత్రమే వసూల్ అయ్యాయి . అయితే ఈరోజు ఆదివారం కావడంతో కొంతవరకు బెటర్ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది .
 
 

ఇక రేపటి నుండి అసలు పరీక్ష మొదలు కానుంది రణబీర్ కపూర్ కు . అయితే సినిమా కు లాభాలు రాకుండా బయ్యర్లు ఎవరైనా నష్టపోతే ఆ డబ్బు తిరిగి ఇస్తానని మాట ఇచ్చాడు రణబీర్ కపూర్ దాంతో బయ్యర్లు కొంత సంతోషంగానే ఉన్నారు . పెట్టిన పెట్టుబడి ఈ సినిమా ద్వారా వస్తే ఓకే లేదంటే ఎలాగూ రణబీర్ ఉన్నాడు కదా ! అని అనుకుంటున్నారు బయ్యర్లు .
Comments

FOLLOW
 TOLLYWOOD