వైశాఖం పై కాన్ఫిడెంట్ గా ఉన్న జయ
TOLLYWOOD
 TOPSTORY

వైశాఖం పై కాన్ఫిడెంట్ గా ఉన్న జయ

Murali R | Published:January 12, 2017, 12:00 AM IST
వైశాఖం చిత్రం ఈ ఏడాది వేసవిలో రిలీజ్ అవుతుందని ,తప్పకుండా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం ఉందన్నారు డైనమిక్ లేడీ బి . జయ . ఆర్ జే సినిమాస్ పతాకంపై సీనియర్ జర్నలిస్ట్ , స్టార్ పీఆర్ ఓ బి ఏ రాజు నిర్మించిన చిత్రం వైశాఖం . బి . జయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిర్విరామంగా జరుగుతున్నాయి . ఈరోజు దర్శకురాలు జయ పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి చిత్ర విశేషాలను వెల్లడించారు .

అపార్ట్ మెంట్ కల్చర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా రూపొందించాం  , పాటల కోసం కజకిస్థాన్ కు వెళ్ళాం .  అక్కడ అందమైన ప్రదేశాల్లో పాటలను చిత్రీకరించడం ద్వారా సినిమాకి ఫ్రెష్ లుక్ తీసుకొచ్చాం . మా వైశాఖం స్పెషాలిటీ ఏంటంటే ఇంతవరకు కజకిస్థాన్ లో ఏ సినిమా కూడా షూటింగ్ జరుపుకోలేదు , మొట్టమొదటి చిత్రం మా వైశాఖం కావడం గమనార్హం .

నిర్మాతగా బి ఏ రాజు గారి ఫుల్ సపోర్ట్ ఉంది , పాటల కోసం కజకిస్థాన్ కు వెళతాం అంటే మరోమాట లేకుండా ఓకే చెప్పేసాడు మరొకరైతే ఎందుకంత దూరం , ఎందుకంత ఖర్చు మన కథ కు అది అవసరమా ? అని అడిగేవాళ్ళు కానీ రాజుగారు మాత్రం మేము అడిగిన ప్రతీ  దానికి ఒప్పుకునేవాళ్ళు . ఒక్కోసారి నాకే భయమేసేది ఇంత ఖర్చు పెడుతున్నాం అదే రేంజ్ లో రిటర్న్స్ వస్తాయా అని అయితే కథ పై బాగా నమ్మకం ఉండటంతో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు .

ఈ చిత్రం ద్వారా హరీష్ - అవంతిక లను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాం . ఆ పాత్రలకు వాళ్ళు సరిపోతారని భావించే ఎంపిక చేసాం , వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసాక మా సెలెక్షన్ తప్పు కాదని, పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారని రేపు సినిమా చూసాక మీరే చెబుతారు . నేను పెట్టే ఫ్రేమ్ లో , తీసే సీన్ లో నాలోని క్రిటిక్ ని సాటిస్ ఫై చేస్తూనే ఉంటాను అంటూ వైశాఖం విజయం ధీమా వ్యక్తం చేసింది డైనమిక్ డైరెక్టర్ జయ . వచ్చే నెలలో ఆడియో రిలీజ్ కానుండగా వేసవిలో సినిమా రిలీజ్ కానుంది .Comments

FOLLOW
 TOLLYWOOD