బాహుబలి కి చైనాలో కష్టాలు తప్పవా
TOLLYWOOD
 TOPSTORY

బాహుబలి కి చైనాలో కష్టాలు తప్పవా

Murali R | Published:June 18, 2017, 12:00 AM IST
ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి ప్రభంజనం సృష్టించింది అలాగే బాహుబలి పార్ట్ 2 కూడా కానీ చైనాలో మాత్రం బాహుబలి పప్పులు ఉడకడం లేదు . గ్రాఫిక్ మాయాజాలం గా తెరకెక్కిన బాహుబలి చైనాలో ఘోర పరాజయం పొందింది దాంతో బాహుబలి 2 కి కష్టాలు తప్పడం లేదు . బాహుబలి 2 ని కొనడానికి పెద్దగా ఉత్సాహం చూపించడం లేదు అయితే బాహుబలి యూనిట్ మాత్రం 4000 స్క్రీన్ లకు తక్కువ కాకుండా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు .
 
 

సెప్టెంబర్ లో బాహుబలి 2ని చైనా జనాల మీదకు వదలడానికి రంగం సిద్ధం చేస్తున్నారు . అయితే దంగల్ స్థాయిలో విజయం సాధించడం కష్టమే అని ముందే తేలిపోయింది . దంగల్ క్రీడానేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడం , చైనాలో ఎక్కువగా క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కావడంతో ఆ సినిమాకు బ్రహ్మరధం పట్టారు కానీ బాహుబలి 2 కి అలా కాదు మరి . సినిమా రిలీజ్ అయితే కానీ తెలీదు ఏ రేంజ్ వసూళ్లు రాబడుతుందో . 
Comments

FOLLOW
 TOLLYWOOD