బాహుబలి ప్రెస్ మీట్ రేపే
TOLLYWOOD
 TOPSTORY

బాహుబలి ప్రెస్ మీట్ రేపే

Murali R | Published:September 29, 2016, 12:00 AM IST

గత ఏడాది రిలీజ్ అయి సంచలన విజయం సాధించిన బాహుబలి కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న బాహుబలి ది కంక్లూజన్ ప్రెస్ మీట్ రేపు ఏర్పాటు చేస్తున్నారు . హైదరాబాద్ లోని దస్ పల్లా హోటల్ లో బాహుబలి టీం మొత్తం పాల్గొననుంది . దాదాపుగా షూటింగ్ అంతా పూర్తికాగా కొంత ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ గా ఉందట . అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులను అన్నింటిని కంప్లీట్ చేసి ఏప్రిల్ 28న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ఆర్కా మీడియా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది . ప్రభాస్ , అనుష్క , రానా , తమన్నా , రమ్యకృష్ణ , సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
Comments

FOLLOW
 TOLLYWOOD