బాలయ్యే ముహూర్తం పెట్టాడట
TOLLYWOOD
 TOPSTORY

బాలయ్యే ముహూర్తం పెట్టాడట

Murali R | Published:October 11, 2017, 6:54 PM IST
పైసా వసూల్ చిత్రంతో భారీ డిజాస్టర్ ని అందుకున్నాడు బాలయ్య అలాగే దర్శకులు పూరి జగన్నాధ్ . అయితే వెంటనే ఆ డిజాస్టర్ నుండి బయటకు వచ్చిన పూరి జగన్నాధ్ మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు . అయితే ఈసారి ప్రేమకథ ని ఎంచుకోవడమే కాకుండా హిందూ - ముస్లిం ల ప్రేమకథా చిత్రాన్ని ఎంచుకోవడం విశేషం . అంతేకాదు యమా స్పీడ్ గా మెహబూబా సినిమాని పట్టాలెక్కించాడు కూడా . నటసింహం నందమూరి బాలకృష్ణ ముహూర్తం చూసి మరీ స్టార్ట్ చేయించాడట . 
 
 
బలయ్ ముహూర్తం నిర్ణయించడమే కాకుండా ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటూ తగిన సలహాలు సూచనలు కూడా ఇచ్చాడట దాంతో బాలయ్య కు కృతఙ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేసింది మెహబూబా చిత్ర బృందం . పూరి తనయుడు ఆకాష్ హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు ఈ చిత్రంతో . హిమాచల్ ప్రదేశ్ లో ఈరోజు ప్రారంభమైన మెహబూబా ని వీలైనంత తక్కువ సమయంలో తీసి పడేసి హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు పూరి జగన్నాధ్ . మరి ఈ సినిమా ఏమౌతుందో !Comments

FOLLOW
 TOLLYWOOD