మెగా నిర్మాతలపై సీరియస్ అయిన బాలయ్య
TOLLYWOOD
 TOPSTORY

మెగా నిర్మాతలపై సీరియస్ అయిన బాలయ్య

Murali R | Published:November 16, 2017, 4:53 PM IST
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ చిత్రానికి ఏకంగా 9 అవార్డులను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాంతో నంది అవార్డుల పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి . ఇక మెగా నిర్మాతలు బన్నీ వాసు ,బండ్ల గణేష్ , దర్శక నిర్మాత గుణశేఖర్ లు నంది అవార్డుల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై సంచలన ఆరోపణలు కూడా చేసిన విషయం తెలిసిందే . ఇప్పుడా ఆరోపణలు సినిమారంగంలో సంచలనం సృష్టిస్తున్నాయి . నిన్న అంతా మీడియాలో ఇదే గొడవ గొడవ అయ్యింది.
ఈలొల్లి ఎక్కువ కావడంతో బాలకృష్ణ చాలా సీరియస్ అయ్యాడట ! అన్నీ మూసుకుంటే బాగుంటుంది అని తన అనుచరుల వద్ద వాపోయాడట ! ఇంకేముంది బాలయ్య బన్నీ వాసు ,గుణశేఖర్ ,బండ్ల గణేష్ ల మీద సీరియస్ అయిన విషయం క్షణాల్లో పాకింది . దాంతో ఆ నిర్మాతలు గమ్మునుండి పోయారు . అయితే బాలయ్య మాత్రం వాళ్ళ పై సీరియస్ గా ఉన్నాడట . మొత్తానికి బాలయ్య లెజెండ్ పలు వివాదాలను సృష్టిస్తోంది నంది అవార్డుల రూపంలో.Comments

FOLLOW
 TOLLYWOOD