బాలయ్య సంచలన నిర్ణయం
TOLLYWOOD
 TOPSTORY

బాలయ్య సంచలన నిర్ణయం

Murali R | Published:September 4, 2017, 12:00 AM IST
నటసింహం నందమూరి బాలకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నాడు . పైసా వసూల్ చిత్రం ఘోర పరాజయం పొందడంతో తన 103 వ చిత్రాన్ని యువ దర్శకులు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది .నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన  పటాస్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై అద్భుత విజయాన్ని అందుకున్న  అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని సాయి ధరమ్ తేజ్ తో '' సుప్రీమ్ '' చేసి హిట్ కొట్టాడు . ఇప్పుడు రవితేజ హీరోగా '' రాజా ది గ్రేట్ '' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు వచ్చే నెలలో ఆ సినిమా రిలీజ్ కానుంది.

ఇక బాలయ్య వందో సినిమా సమయంలోనే '' రామారావు గారు '' అనే కథ ని బాలయ్య కు వినిపించాడు అనిల్ రావిపూడి అయితే అప్పట్లో బాలయ్య నుండి మళ్ళీ అనిల్ కు పిలుపు రాకపోవడంతో ఆ సినిమా అటకెక్కింది కానీ ఇప్పుడు పైసా వసూల్ ఘోర పరాజయం పొందడంతో మళ్ళీ రామారావు గారు కథ లైన్ లోకి వచ్చింది . ప్రస్తుతం బాలయ్య 102 వ సినిమాగా కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు . దాని తర్వాత 103 వ సినిమాగా అనిల్ రావిపూడి తో ప్రాజెక్ట్ ఉంటుందని తెలుస్తోంది.

Related Links

Balakrishna top five movies
Nandamuri Balakrishna Scholorships news
Balakrishna tongue slip on AmitabComments

FOLLOW
 TOLLYWOOD