ఫైటర్లను కొట్టిన బాలయ్య
TOLLYWOOD
 TOPSTORY

ఫైటర్లను కొట్టిన బాలయ్య

Murali R | Published:October 16, 2017, 8:31 PM IST
నటసింహం నందమూరి బాలకృష్ణ ఫైటర్ల ని కొట్టాడు , అది కూడా స్టేజి మీద . బాలయ్య కొట్టింది నిజమే ! అది కూడా ఫైటర్ల ని కానీ అది రియల్ ఫైట్ కాదు రీల్ ఫైట్ కూడా కాదు కేవలం ఓ ఈవెంట్ లో ఆహుతులను అలరించడం కోసం ఫైట్ మాస్టర్ ల సంక్షేమం కోసం . ఇటీవల చెన్నై లో ఫైట్ మాస్టర్ ల అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున వేడుక జరిగింది . ఆ వేడుకకు దక్షిణాదికి చెందిన పలువురు స్టార్ హీరోలు హాజరయ్యారు , రజనీకాంత్ , బాలకృష్ణ , మోహన్ లాల్ , సూర్య లతో పాటు దక్షిణాది స్టార్ హీరోలంతా పాల్గొన్నారు.

కాగా ఆ వేడుకలో బాలయ్య ని వేదిక మీదకు పిలిచిన సందర్భంలో ఫైట్ మాస్టర్ లతో ఫైట్ చేయాలని కోరగా బాలయ్య అందుకు సిద్ధమని చెప్పడమే కాకుండా అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ చేసి అహతులను అలరించాడు అంతేకాదు తొడకొట్టి మరీ అందరినీ ఉత్సాహ పరిచాడు . అలాగే తమిళంలో మాట్లాడి అందరి ప్రశంసలు అందుకున్నాడు . ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.Comments

FOLLOW
 TOLLYWOOD