అమితాబ్ ని బూతులు తిట్టిన బాలయ్య
TOLLYWOOD
 TOPSTORY

అమితాబ్ ని బూతులు తిట్టిన బాలయ్య

Murali R | Published:September 1, 2017, 12:00 AM IST
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా బూతు మాట అని సంచలనం సృష్టించాడు నందమూరి బాలకృష్ణ . రాజకీయాల్లోకి వచ్చి అమితాబ్ ఏం ! పీకాడు అంటూ ఒక్క అమితాబ్ ని మాత్రమే కాకుండా చిరంజీవి ని సైతం ఏం పీకాడని దాదాపుగా వచ్చింది కానీ మరోలా మాట అనేసి రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే ఒక్క నందమూరి కుటుంబం మాత్రమే మిగతావాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఏం పీకలేక పోయారని ఘాటుగా స్పందించాడు బాలయ్య.

పైసా వసూల్ చిత్ర ప్రమోషన్ లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో బాలయ్య ఇలా నోరు జారడం సంచలనం సృష్టిస్తోంది . బాలయ్య కు అమితాబ్ పైన ఎందుకు కోపమో ఇప్పుడు అర్ధం అయ్యిందనుకుంటా . రైతు సినిమాలో నటించాలని దర్శకులు కృష్ణవంశీ తో కలిసి రామోజీ ఫిలిం సిటీ కి వెళ్లి మరీ కోరాడు బాలయ్య . అయితే బాలయ్య సినిమాలో నటించడానికి నిరాకరిస్తూ రకరకాల కారణాలు చెప్పాడు కట్ చేస్తే చిరంజీవి సైరా నరసింహారెడ్డి లో అమితాబ్ నటించడానికి ఒప్పుకోవడమే ఈ ఆగ్రహానికి కారణం.

Related Links

Nandamuri Balakrishna Scholorships news
Amitab insult Balakrishna
Balakrishna not interested in Bigg BossComments

FOLLOW
 TOLLYWOOD