బాలయ్య ని ఓడిస్తానంటున్న నవీన్
TOLLYWOOD
 TOPSTORY

బాలయ్య ని ఓడిస్తానంటున్న నవీన్

Murali R | Published:December 18, 2017, 4:09 AM IST

2019 లో జరిగే ఎన్నికల్లో హిందూపురం లో బాలక్రిష్ణ ని ఓడిస్తానని అంటున్నాడు వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నవీన్ నిశ్చల్. బాలయ్య హిందూపురం కు చేసిన అభివృద్ధి ఏమి లేదని కానీ నాకు పదవి లేకపోయినా హిందూపురం లో ఎక్కడ చూసినా నేను నాటించిన మొక్కలే కనిపిస్తాయని అందువల్ల వచ్చే ఎన్నికల్లో బాలయ్య ఓడిపోవడం ఖాయమని అంటున్నాడు నవీన్.

 

2014 ఎన్నికల్లో బాలయ్య హిందూపురం నుండి ఎం ఎల్ ఏ గా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఎం ఎల్ ఏ అయ్యాడు కానీ అక్కడి ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడమే కాకుండా పలు సమస్యలు పేరుకుపోవడంతో ఆ నియోజకవర్గ ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలయ్య కు అక్కడ ప్రస్తుతం అయితే వ్యతిరేకత ఉంది కాని ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున బాలయ్య సర్దుకుంటే సెట్ అవుతుంది లేదంటే ఓటమి ఖాయమని అంటున్నారు.
Comments

FOLLOW
 TOLLYWOOD