చిరంజీవి కి విషెస్ చెప్పిన బాలయ్య
TOLLYWOOD
 TOPSTORY

చిరంజీవి కి విషెస్ చెప్పిన బాలయ్య

Murali R | Published:January 12, 2017, 12:00 AM IST
నటసింహం నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి కి విషెస్ తెలిపాడు . రేపు చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150వ చిత్రం రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆ చిత్రం హిట్ కావాలని , సరైన పోటీ ఉన్నప్పుడే మన సత్తా ఏంటో తెలుస్తుంది అంతేకాని పోటీ లేకుండా ఘనవిజయం సాధిస్తే అందులో కిక్ ఏముంది అంటూ చిరంజీవి సినిమా కూడా హిట్ కావాలని కోరుకుంటున్నానంటూ బెస్ట్ విషెస్ తెలిపాడు బాలయ్య . 
 
 

చిరంజీవి - బాలకృష్ణ ఇద్దరు కూడా మాస్ హీరోలు కావడం ఇద్దరు కూడా బాక్సాఫీస్ వద్ద పోటీ పడి నువ్వా - నేనా అన్నట్లుగా జోరు చూపించారు . అయితే పదేళ్ల తర్వాత చిరంజీవి - బాలయ్య మళ్ళీ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు దాంతో అటు మెగా ఫ్యాన్స్ ఇటు నందమూరి ఫ్యాన్స్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది . అభిమానుల్లో పోటీ ఎక్కువగా ఉంది మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ కానీ చిరంజీవి - బాలకృష్ణ లు మాత్రం ఇద్దరి సినిమాలు హిట్ కావాలని కోరుకుంటున్నారు . 
Comments

FOLLOW
 TOLLYWOOD