అమితాబ్ ఒప్పుకోక పొతే బాలయ్య చేయడట
TOLLYWOOD
 TOPSTORY

అమితాబ్ ఒప్పుకోక పొతే బాలయ్య చేయడట

Murali R | Published:January 12, 2017, 12:00 AM IST

లివింగ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ రైతు సినిమాలో నటించకపోతే ఇక రైతు సినిమా లేనట్లేనని , అయన నటిస్తేనే రైతు సినిమా ఉంటుందని లేకపోతే లేదని కుండబద్దలు కొట్టాడు నటసింహం నందమూరి బాలకృష్ణ . గౌతమిపుత్ర శాతకర్ణి ఈనెల 12న రిలీజ్ అవుతున్నందున ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ చిత్ర విశేషాలను వెల్లడించాడు బాలయ్య . 

కృష్ణవంశీ నేను వెళ్లి అమితాబ్ ని కలిసాం మా పద్దతిలో సినిమా ఇలా ఉంటుందని చెప్పాము అయితే ఇంకా అమితాబ్ మాత్రం ఏ విషయం చెప్పలేదని ప్రస్తుతం మా దృష్టి అంతా గౌతమిపుత్ర శాతకర్ణి పైనే ఉందని దీని తర్వాత అమితాబ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే రైతు చిత్రం పట్టాల మీదకు ఎక్కిస్తామని అన్నారు బాలయ్య . ఇక నుండి సరికొత్త బాలయ్య ని చూస్తారని , సినిమా విజయం పై అపారమైన నమ్మకం ఉందని క్రిష్ పై ప్రశంసల వర్షం కురిపించారు బాలయ్య . 
Comments

FOLLOW
 TOLLYWOOD