బాలయ్య లెజెండ్ పై పెద్ద ఎత్తున విమర్శలు
TOLLYWOOD
 TOPSTORY

బాలయ్య లెజెండ్ పై పెద్ద ఎత్తున విమర్శలు

Murali R | Published:November 16, 2017, 1:11 PM IST
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ చిత్రానికి అత్యధికంగా 9 నంది అవార్డు లు రావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014 సంవత్సరానికి గాను లెజెండ్ చిత్రానికి ఉత్తమ నటుడి అవార్డు తో పాటు మరో ఎనిమిది నందులు ప్రకటించారు. దాంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిపడుతున్నాయి. 
 
 
 
మెగా హీరోలను పక్కన పెట్టి తమకు కావాల్సిన వాళ్లకు మాత్రమే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అవార్డు లను ఇచ్చిందని ఘాటుగా విమర్శిస్తున్నాడు మెగా నిర్మాత బండ్ల గణేష్. నేను రాంచరణ్ తో నిర్మించిన గోవిందుడు అందరివాడేలే చిత్రానికి అవార్డులు ఇవ్వకుండా అన్యాయం చేశారని కేవలం మన అనుకున్న వాళ్లకు మాత్రమే నంది అవార్డులు ఇచ్చారని విమర్శిస్తున్నాడు బండ్ల గణేష్. బాలకృష్ణ, మహేష్ బాబు, ఎన్టీఆర్ లకు ఉత్తమ నటుడు అవార్డులు వచ్చాయి దాంతో మెగా కుటుంబానికి కోపం తన్నుకొస్తోంది. Comments

FOLLOW
 TOLLYWOOD