రవితేజ సినిమాని తన్నుకుపోయిన సునీల్
TOLLYWOOD
 TOPSTORY

రవితేజ సినిమాని తన్నుకుపోయిన సునీల్

Murali R | Published:September 13, 2017, 12:00 AM IST
సునీల్ హీరోగా నటించిన మొదటి చిత్రం అందాల రాముడు . అయితే ఆ సినిమాలో మొదటగా అనుకున్న హీరో రవితేజ కాగా అందులో హీరో వెంట ఉండే హాస్య పాత్రలో సునీల్ ని అనుకున్నారు , రిహార్సల్స్ కూడా చేశారట కట్ చేస్తే రవితేజ నటించిన ఇడియట్ సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయ్యింది అంతే హీరో ని మార్చారు . రవితేజ కు మాస్ ఇమేజ్ వచ్చింది కాబట్టి సాఫ్ట్ గా ఉండే క్యారెక్టర్ చేస్తే బాగుండదు అని భావించిన చిత్ర నిర్మాత ఆర్బీ చౌదరి రవితేజ స్థానంలో సునీల్ ని హీరోగా ఎంచుకున్నాడు.

అయితే సునీల్ హీరోగా నటించడానికి ససేమిరా అన్నాడట ! కట్ చేస్తే దర్శకులు త్రివిక్రమ్ ఇచ్చిన సలహాతో హీరోగా నటించడానికి ఒప్పుకున్నాడు . ఇంకేముంది సునీల్ హీరోగా నటించడం ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం జరిగిపోయింది . త్రివిక్రమ్ ఇచ్చిన సలహాతో సునీల్ హాస్యనటుడు స్థాయి నుండి హీరోగా మారాడు సిక్స్ ప్యాక్ చేసాడు , సక్సెస్ లు చవిచూశాడు అయితే ఇప్పుడు మాత్రం హిట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు . ఉంగరాల రాంబాబు హిట్ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . ఇక ఈ పదిహేనున ఆ సినిమా రిలీజ్ అవుతోంది . ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.Comments

FOLLOW
 TOLLYWOOD