Home Topstories వారసుడి కోసం ఆస్థి అంతా ధారపోస్తున్నాడు
TOLLYWOOD
 TOPSTORY

వారసుడి కోసం ఆస్థి అంతా ధారపోస్తున్నాడు



Tuesday June 13th 2017
వారసుడు హీరోగా నిలబడతాడని , డబ్బు సంపాదించి కీర్తి ప్రతిష్టలను పెంచుతాడని గట్టిగా నమ్ముతున్న నిర్మాత బెల్లంకొండ సురేష్ తన ఆస్థులను ధారపోస్తూ కొడుకు పై భారీగా ఆశలు పెట్టుకున్నాడు . ఈ సినిమా రంగం వారసుల రాజ్యం కాబట్టి ఆ వారసుల రాజ్యం లోకి తన వారసుడిని పంపాడు బెల్లంకొండ . మొదటి సినిమానే '' అల్లుడు శీను '' ని  భారీ స్థాయిలో నిర్మించి అందరికీ షాక్ ఇచ్చాడు అయితే హీరోగా ఓకే అనిపించుకున్నాడు కానీ భారీ హిట్ కొట్టలేదు.

దాని తర్వాత స్పీడున్నోడు చేసాడు దీనికి కూడా బాగానే ఖర్చు పెట్టారు కానీ డిజాస్టర్ అయ్యింది , ఇక ఇప్పుడేమో బోయపాటి శ్రీను దర్శకత్వంలో భారీ ఎత్తున సినిమా నిర్మిస్తున్నాడు అది పూర్తి కావచ్చింది , అందుకే శ్రీవాస్ దర్శకత్వంలో మరో సినిమా సెట్స్ పైకి వెళ్ళింది . నిన్నటి నుండి రామోజీ ఫిలిం సిటీ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది . వారసుడిని హీరోగా నిలబెట్టడానికి అంతా ధారపోస్తున్నాడు బెల్లంకొండ మరి ఈ హీరో స్టార్ రేంజ్ ని అందుకుంటాడా చూడాలి.

Comments

FOLLOW
 TOLLYWOOD
POLLS
Read More..