కొడుకుని కిడ్నాప్ చేసిన హీరో
TOLLYWOOD
 TOPSTORY

కొడుకుని కిడ్నాప్ చేసిన హీరో

Murali R | Published:September 13, 2017, 12:00 AM IST
కన్న కొడుకుని కిడ్నాప్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు . సంచలనం సృష్టించిన ఈ సంఘటన దేశరాజధాని న్యూ ఢిల్లీ లో జరిగింది . భోజ్ పురి హీరో మహమ్మద్ షాహిద్ పలు చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు , అయితే భార్య తన నుండి విడాకులు తీసుకొని వెళ్లిపోవడంతో రెండేళ్ల కొడుకు ని కూడా కోర్టు షాహిద్ కు దూరం చేసింది . ఆ బాబు తల్లి దగ్గరే పెరగాలని కోర్టు తీర్పు ఇవ్వడంతో తన కొడుకు ని ఎలాగైనాసరే తన దగ్గరే ఉంచుకోవాలని డ్రామా ఆడి కిడ్నాప్ చేయించాడు .
 
 

తీరా తన కొడుకు ని ఎవరో కిడ్నాప్ చేసారని నాటకాలు మొదలు పెట్టాడు అయితే హీరో గారి మాజీ భార్య పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు . మహమ్మద్ షాహిద్ పై అనుమానం ఉండటంతో కొన్నిరోజులుగా నిఘా పెట్టారు . ఇంకేముంది కిడ్నాప్ డ్రామా ఆర్టిస్ట్ పోలీసులకు దొరికిపోయాడు . భార్య విడాకులు ఇవ్వడంతో మరో యువతి తో సహజీవనం చేస్తున్నాడు ఈ హీరో కానీ కొడుకు కోసం విలన్ గా మారడంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు . 
Comments

FOLLOW
 TOLLYWOOD