బిగ్ బాస్ టీజర్ వచ్చేసింది
TOLLYWOOD
 TOPSTORY

బిగ్ బాస్ టీజర్ వచ్చేసింది

Murali R | Published:June 19, 2017, 12:00 AM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా బిగ్ బాస్ రియాలిటీ షో చేయడానికి అంగీకరించిన విషయం తెలిసిందే . కాగా ఆ టీజర్ నిన్న సాయంత్రం రిలీజ్ చేసారు . ఇద్దరు అందమైన భామలు ఎన్టీఆర్ కి ఇరువైపులా ఉన్న ఈ టీజర్ తో బిగ్ బాస్ పై అంచనాలు పెంచేసారు . స్టార్ మా యాజమాన్యం సగర్వంగా సమర్పిస్తున్న ఈ షోతో ఎన్టీఆర్ బుల్లితెర హోస్ట్ గా మారిపోయాడు . ఇక ఈ షో కోసం ఎన్టీఆర్ కు భారీ ఎత్తున రెమ్యునరేషన్ ని ఇస్తున్నారు .
 
 

ముంబై లో షూట్ చేసుకునే ఈ షో నిజంగా తెలుగు ప్రేక్షకులకు కొత్తే ! ప్రస్తుతం ఎన్టీఆర్ జై లవకుశ చిత్రం చేస్తున్నాడు . బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే . సెప్టెంబర్ 1 న జై లవకుశ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .
Comments

FOLLOW
 TOLLYWOOD