రష్మీ ని తీసేశారట జబర్దస్త్ నుండి
TOLLYWOOD
 TOPSTORY

రష్మీ ని తీసేశారట జబర్దస్త్ నుండి

Murali R | Published:October 12, 2017, 7:30 PM IST
జబర్దస్త్ షో తెలుగునాట చాలా పాపులర్ అయిన షో అన్న విషయం అందరికీ తెలిసిందే . ఆ షో వల్లే అనసూయ హాట్ భామగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది , అలాగే రష్మీ కూడా జబర్దస్త్ షో ద్వారానే ఫేమస్ అయ్యింది . చాలాకాలంగా జబర్దస్త్ , ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమాలు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రష్మీ స్థానంలో బిగ్ బాస్ తో పాపులర్ అయిన హరితేజ ని తీసుకున్నారని అంటున్నారు.

రష్మీ జబర్దస్త్ షో ని బాగానే హోస్ట్ చేసింది అయితే కాలం మారుతోంది అంతేకాకుండా మార్పు కూడా కావాలి అని భావించిన మల్లెమాల నిర్వాహకులు రష్మీ స్థానంలో హరితేజ ని ఎంపిక చేశారట . ఈ వార్త అవునో నిజమో తెలియాలంటే కొద్దిరోజులు ఆగితే తేలిపోనుంది . జబర్దస్త్ షో అడల్ట్ జోకులతో కొంతమంది ని ఇబ్బంది పెడుతున్నప్పటికీ హాస్యం రూపు మారిపోయింది కాబట్టి మిగతా వాళ్ళు బాగా అలవాటు పడిపోయారు జబర్దస్త్ కు.Comments

FOLLOW
 TOLLYWOOD