ఎన్టీఆర్ బాక్సాఫీస్ ని కుమ్మేయడం ఖాయం
TOLLYWOOD
 TOPSTORY

ఎన్టీఆర్ బాక్సాఫీస్ ని కుమ్మేయడం ఖాయం

Murali R | Published:September 12, 2017, 12:00 AM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ మొదటి రోజు బాక్సాఫీస్ ని కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తోంది . ఎందుకంటే ఇప్పటికే టీజర్ లతో అంచనాలు పెంచిన ఎన్టీఆర్ తాజాగా ట్రైలర్ తో కేక పెట్టిస్తున్నాడు . జై లవకుశ ట్రయిలర్ చూసిన వాళ్ళు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు . సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా ? సెప్టెంబర్ 21ఎప్పుడా అని ఉత్సుకత ని ఆపుకోలేక పోతున్నారు . ఇక రానా అయితే జై లవకుశ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అంటూ డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు .
 

రానా సంగతి అలా ఉంటే ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ నందమూరి అభిమానుల గురించి కొత్తగా చెప్పేదేముంది వాళ్ళు కూడా సెప్టెంబర్ 21 కోసం ఎదురుచూస్తున్నారు . దాంతో ఈ సినిమా రికార్డుల మోత మోగించేలా ఉంది అయితే సినిమా బాగుంటే సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం . దాని సంగతి పక్కన పెడితే మొదటి రోజు వసూళ్ల తో పాటుగా మొదటి మూడు రోజుల రికార్డులు కూడా తారుమారు కావడం ఖాయం . ఆ తర్వాత సినిమా జోరు ని బట్టి తదుపరి రికార్డులు ఉంటాయి ఇప్పుడు మాత్రం ఫస్ట్ డే వసూళ్ల లో నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం .
Comments

FOLLOW
 TOLLYWOOD