బోయపాటి తదుపరి సినిమా చరణ్ తోనా
TOLLYWOOD
 TOPSTORY

బోయపాటి తదుపరి సినిమా చరణ్ తోనా

Murali R | Published:August 29, 2017, 12:00 AM IST
మాస్ దర్శకులు బోయపాటి శ్రీను త్వరలో చేయబోయే సినిమాల లిస్ట్ ఇది అంటూ చిరంజీవి , బాలకృష్ణ , మహేష్ బాబు ల పేర్లు చెప్పాడు కానీ ఎక్కడ కూడా రాంచరణ్ తో చేయబోతున్నట్లు చెప్పలేదు కానీ తాజాగా వినబడుతున్న కథనం ప్రకారం చరణ్ తో బోయపాటి శ్రీను తదుపరి సినిమా అన్న ప్రచారం సాగుతోంది . రాంచరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 అనే చిత్రం చేస్తున్నాడు.

ఆ సినిమా పూర్తయ్యాక బోయపాటి శ్రీను సినిమా ఉండొచ్చు అని తెలుస్తోంది , ఇక చరణ్ కూడా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నాడట . అలాగే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమాని నిర్మించడానికి చరణ్ మేనమామ అల్లు అరవింద్ ముందుకు వచ్చినట్లు కూడా తెలుస్తోంది . ఇంతకుముందు చరణ్ తో మగధీర వంటి బ్లాక్ బస్టర్ ని ధృవ వంటి సూపర్ హిట్ ని నిర్మించింది అల్లు అరవిందే.

ఇటీవలే జయ జానకి నాయక అనే సినిమాతో బోయపాటి డిజాస్టర్ అందుకున్నాడు అయినప్పటికీ మాస్ హీరోలు మాత్రం బోయపాటి తో సినిమాలు చేయడానికే ఉత్సాహం చూపిస్తున్నారు . బోయపాటి ప్రస్తుతం ఖాళీ గానే ఉన్నాడు చరణ్ సై అంటేబోయపాటి సై  సై అనడం ఖాయం.Comments

FOLLOW
 TOLLYWOOD