మహేష్ బోయపాటి కి డేట్స్ ఇస్తాడా
TOLLYWOOD
 TOPSTORY

మహేష్ బోయపాటి కి డేట్స్ ఇస్తాడా

Murali R | Published:August 10, 2017, 12:00 AM IST
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను చిత్రంలో నటిస్తున్నాడు . రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడు . ఆ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్నాడు . అంతేకాదు వంశీ తర్వాత పలువురు దర్శకులు మహేష్ కోసం క్యూ కడుతున్నారు . మరి ఈ నేపథ్యంలో బోయపాటి శ్రీను కూడా మహేష్ తో సినిమా చేయాలనీ ఆశపడుతున్నాడు .
 

ఇప్పటికే మహేష్ కోసం చేసిన కథ ని వినిపించాడట కానీ మహేష్ ఇంకా ఏది కన్ఫర్మ్ చేయలేదు ,పైగా బోయపాటి శ్రీను ఎక్కువ రోజుల సమయం కోరుతున్నాడు కాబట్టి మహేష్ ఆలోచనలో పడ్డాడట . బోయపాటి మాస్ దర్శకులు అందులో సందేహం లేదు అయితే ఎక్కువ రోజులు కేటాయించడం అన్న కోణంలో మహేష్ తర్జన భర్జన పడుతున్నాడట . మరి బోయపాటి కి మహేష్ డేట్స్ ఇస్తాడా ? లేక వెయింటింగ్ లిస్ట్ లో పెడతాడా చూడాలి .  ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే బాక్స్ లు బద్దలు కావలసిందే మరి . 
Comments

FOLLOW
 TOLLYWOOD