ఆ సినిమాని నిషేధించమని డిమాండ్ చేస్తున్నారు
TOLLYWOOD
 TOPSTORY

ఆ సినిమాని నిషేధించమని డిమాండ్ చేస్తున్నారు

Murali R | Published:January 12, 2017, 12:00 AM IST
ద్యావుడా సినిమాలో శివలింగం ని , వెంకటేశ్వర స్వామిని అవమానించి హిందువుల మనోభావాలను కించపరిచేలా చేసిన దర్శక నిర్మాతలను శిక్షించాలని అలాగే ద్యావుడా సినిమాని నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు పలువురు బ్రాహ్మణులు . ఆ ఆమేరకు తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ ని కలిసి ద్యావుడా చిత్ర దర్శక నిర్మాత లపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసారు పరశురామ్ పరివార సంఘం సభ్యులు . 
 
 

ఇటీవల ద్యావుడా చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేసారు ఆ చిత్ర యూనిట్ . అయితే తీవ్ర స్థాయిలో వివాదాస్పదంగా ఉన్న ఈ ట్రైలర్ పట్ల పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక కొంతమంది అయితే నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు కూడా చేసారు . ఇక దర్శక నిర్మాతలను వదిలేది లేదు అంటూ భౌతిక దాడులకు దిగుతామని హెచ్చరిస్తున్నారు కూడా . తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం కావడంతో దర్శకుడు దిగి వచ్చి క్షమాపణ కోరుతూ పత్రికా ప్రకటన చేసాడు కానీ వాళ్ళు వినేలా లేరు .
Comments

FOLLOW
 TOLLYWOOD