శాతకర్ణి ని చూసిషాక్ అయిన కూతురు
TOLLYWOOD
 TOPSTORY

శాతకర్ణి ని చూసిషాక్ అయిన కూతురు

Murali R | Published:January 13, 2017, 12:00 AM IST
బాలయ్య నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని అల్లుడు నారా లోకేష్ కూతురు బ్రాహ్మిణి చూశారట ! సినిమా చూసాక మాట్లాడటానికి నోట మాట రాక అలా షాక్ లోనే ఉండిపోయారట లోకేష్ - బ్రాహ్మిణి . ఇదే విషయాన్నీ ట్వీట్ చేసారు కూడా ఆ ఇద్దరూ . గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని చూసాక షాక్ అయ్యారట అంటే బాగోలేక కాదు సుమా ! సినిమా బాగుంటుంది అని అనుకున్నాం కానీ ఇంత అద్భుతంగా ఉంటుందని మాత్రం అనుకోలేదు అంటూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారట లోకేష్ బ్రాహ్మిణి లు .

బాలయ్య నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి పై భారీ అంచనాలు నెలకొన్నాయి . సంక్రాంతి రేసులో అటు చిరంజీవి ఇటు బాలయ్య కొదమ సింహాల్లా గర్జించ నున్నారు . క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రియా శరన్ , హేమా మాలిని నటించగా చిరంతాన్ భట్ సంగీతం అందించాడు కాగా రేపు ఈ సినిమా రిలీజ్ కానుంది .Comments

FOLLOW
 TOLLYWOOD